గుర్తుతెలియని వాహనం ఢీకొని వాచ్‌మన్ మృతి
ABN, First Publish Date - 2020-12-02T05:22:18+05:30
మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు సమీపంలోని ఐషర్ షోరూం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వాచ్‌మన్ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది
మద్దిపాడు, డిసెంబరు 1 : మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు సమీపంలోని ఐషర్ షోరూం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వాచ్‌మన్ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఏడుగుండ్లపాడు ఎస్సీకాలనీకి చెందిన చినిగే వెంకటేశ్వర్లు(53) గ్రామ స మీపంలోని ఒక కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రో జు మాదిరిగానే విధులకు నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వా హనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు మద్దిపాడు ఎస్‌ఐ ఫీరోజ్‌పాతిమా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.
Updated Date - 2020-12-02T05:22:18+05:30 IST