ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లమలలో వాహనాల రాకపోకలు బంద్‌

ABN, First Publish Date - 2020-09-24T10:42:39+05:30

కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలో మండల పరిధిలోని రోళ్లపెంట సమీపంలో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద దోర్నాల, సెప్టెంబరు 23 : కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిలో నల్లమల అటవీ ప్రాంతంలో మండల పరిధిలోని రోళ్లపెంట సమీపంలో బుధవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల నల్లమలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు మార్జినులు గుంతల మయంగా మారాయి.పైగా కొండ చెరియల నుండి జాలువారిన వర్షఫునీటితో రోడ్డుపై ప్రవహించడంతో రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. అసలే సింగిల్‌ రోడ్డు కావడంతో దీంతో పాటు విజయవాడ, బెంగళూరు వంటి మహా నగరాలకు భారీ సంఖ్యల్లో బరువైన లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.


ఈ నేపధ్యంలో లోడుతో ఉన్న లారీ వేగంఅదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. దీంతో ఎదురెదురుగా ప్రయాణిస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో సుమారు 3గంటల పాటు వాహనాల రాకపోకలు స్థంభించి పోయాయి. దోర్నాల పోలీసుస్టేషనుకు సమాచారం అందడంతో ఎస్సై ఏ హరిబాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రహదారికి అడ్డుగా ఉన్న లారీని తొలగించడంతో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి.


వర్షం కురిసన ప్రతి సారి ఇలాగే జ.రుగుతుండడం పరిపాటిగా మారింది. ప్రయాణికులు పలు ఇక్కట్లకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు పఠిష్టమైన చర్యలు చేపట్టాలని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-24T10:42:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising