ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్దేశిత ధరలకే కూరగాయలు అమ్మాలి

ABN, First Publish Date - 2020-03-30T10:24:09+05:30

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి బాలినేని ఆదేశం

ఎంపీ మాగుంటతో కలిసి మార్కెట్‌ పరిశీలన 


ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 29 : కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు ప్రజలందరూ సహకరించాలని విద్యు త్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డి కోరారు. ఆదివారం ఎంపీ మాగుంట శ్రీని వాసులురెడ్డితో కలిసి ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. ముందుగా వినియోగ దారులతో మంత్రి మాట్లాడారు. కొన్ని రకాల కూర గాయల ధరలు అధికంగా ఉన్నాయని మంత్రి దృషి ్టకి తెచ్చారు. అనంతరం వ్యాపారులతో బాలినేని మా ట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సి న బాధ్యత వ్యాపారులపై కూడా ఉందన్నారు.


ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని సూచి ంచారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో మంత్రి బాలినేని మాట్లాడుతూ రా ష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న ని ర్ణయాల వల్లే కరోనా కేసులు తక్కువగా ఉన్నాయ న్నారు. వలంటరీ వ్యవస్థ వల్ల గ్రామాల్లో విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని కరోనా వ్యాప్తిని అడ్డుకో వడం జరిగిందన్నారు. వచ్చేనెల 14వతేదీ వరకు లాక్‌డౌన్‌ పెట్టినందున ప్రజలందరూ సహకరిచాలని కోరారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ జిల్లాలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉన్న సమయంలో చీరాలకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి రావడంతో వై రస్‌ సోకిందన్నారు.


అయినా జిల్లా అధికార యం త్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని కోరారు. అనంతరం రంగరాయుడు చెరువు కట్ట వద్ద ఉన్న రేషన్‌షా పును పరిశీలించారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యం, కందిపప్పును మంత్రి బాలినేని, ఎంపీ మా గుంట కలిసి కార్డుదారులకు అందజేశారు. కార్యక్ర మంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ నిరంజన్‌ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజువెంకట్రావు, యూత్‌ అ ధ్యక్షుడు గంటా రామానాయుడు, సుబ్బారెడ్డి, నత్తల భీమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-30T10:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising