ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేట వివాదం.. పరిష్కారమయ్యేనా..?

ABN, First Publish Date - 2020-12-02T05:14:37+05:30

గంగపుత్రుల మధ్య వేట విషయంలో వివాదం చెలరేగింది. అది చీరాల మండ లం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది.

వాడరేవు తీరంలో నిలిపివున్న బోట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభ సభ్యుడు మోపిదేవిని కలిసిన మత్స్యకార పెద్దలు

సమస్య పరిష్కారానికి చీరాల డీఎస్పీ దృష్టి

నేడు ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో సమావేశం


చీరాల, డిసెంబరు 1 : గంగపుత్రుల మధ్య వేట విషయంలో వివాదం చెలరేగింది. అది చీరాల మండ లం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం  మత్స్యకార గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది. నివర్‌ తు ఫాన్‌కు ముందు సముద్రంలో ఘర్షణ పడ్డారు. వాడ రేవు మత్స్యకారులకు చెందిన కొన్ని బోట్లను కఠారివా రిపాలెం వారు స్వాధీనం చేసుకున్నారు. కఠారివారిపా లెం వారికి చెందిన కొన్ని బోట్లను వాడరేవు వారు ఆధీ నంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం తారస్థాయికి చేరింది. ఆ క్రమంలో సమస్య పెద్దలు, పోలీసుల వద్ద పంచాయితీకి వెళ్ళింది. 


మార్గదర్శకాలు ఉల్లఘించి..


మత్స్యకారులు సముద్రంలో వేటాడేందుకు వారికి వారు కొ న్ని మార్గదర్శకాలు రూపొం దించుకుంటారు. అది తప్పకు ండా అమలుపరుస్తుంటారు. ఈక్రమంలో వేటకు ఉపయో గించే వల విషయంలో వివా దం నెలకొంది. చీరాల మండ లం వాడరేవుకు చెందిన మత్స్యకారులు తమ వేటలో బల్లవల (లాగుడు వల) వాడుతున్నారని దీంతో త మకు మత్స్యసంపద పడటం లేదని వేటపాలెం మం డలం కఠారివారిపాలెంకు చెందిన మత్స్యకారుల వాద న. వాడరేవు మత్సకారులు ఉపయోగించే వల అరసె ంటీమీటరు కన్నా తక్కువ కన్నుతో ఉందని, అది ని బంధనలకు విరుద్ధమని చెప్తూ వారు తుఫాన్‌కు ముం దు సముద్రంలో ఘర్షణపడ్డారు. ఆ క్రమంలో వాడరే వుకు చెందిన కొన్ని బోట్లను కఠారివారిపాలెం వారు స్వాఽధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకుని వాడరే వు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళి కఠారివారిపా లెంకు చెందిన కొన్ని బోట్లను వాడరేవుకు చేర్చారు.


విక్రయాలు చేయకూడదని కట్టుబాటు


నియోజకవర్గం పరిధిలోని మత్స్యకారులు తాము వేటాడిన మత్స్యసంపదను వాడరేవులో మార్కెట్‌కు విక్రయిస్తుంటారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. ఘర్షణ నేపథ్యంలో కఠారివారి పాలెంకు చెందిన వారు తమ  మత్స్యసంపదను వాడ రేవు మార్కె ట్‌లో విక్రయించేందుకు వీలులేదని స్థాని క పెద్దలు కట్టుబాటు చేశారు.


మార్పులు, చేర్పులతోనే అలా..


ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని మత్స్యకారగ్రామాల పెద్దలు తీసుకున్న ని ర్ణయాల ప్రకారం వేటలో చేర్పులు, మార్పులు జరు గుతుంటాయి. దాని ప్రకారం తాము బల్లవల వాడుతు న్నామని వాడరేవు మత్స్యకారులు అంటున్నారు. అ యితే నిబంధనలకు  విరుద్ధంగా వారు బల్లవల వాడు తున్నారని కఠారివారిపాలెంవాసులు ఆరోపిస్తున్నారు.


ఎంపీ మోపిదేవిని కలిసిన మత్స్యకార పెద్దలు


ఈ క్రమంలో వాడరేవుకు చెందిన కొందరు మత్స్య కార పెద్దలు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటర మణను కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను ఆయనకు వివరించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని మత్స్యకార గ్రామాల పెద్దలు చేసిన ఒప్పందాలు, రాతపూర్వకంగా చేసిన తీర్మానాలను ఆ యనకు చూపారు. ఈ క్రమంలో ఆయన చీరాల డీఎ స్పీ శ్రీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.  


నేడు సమావేశం 


మత్స్యకారుల సమస్య పరి ష్కారానికి బుధవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో పలు శా ఖ అధికారులతో సమావేశం జ రగనుంది. మత్స్య, రెవెన్యూ, పో లీసుశాఖ అధికారులు హాజరు కానున్నారు. అలాగే వివాదాలకు కారణమైన ఆయా గ్రామాలకు చెందిన మత్స్యకారపెద్దలు కూడా రావాల ని వర్తమానం పంపాం. 

- శ్రీకాంత్‌, డీఎస్పీ, చీరాల 


Updated Date - 2020-12-02T05:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising