ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

ABN, First Publish Date - 2020-12-06T05:19:14+05:30

జి ల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 12వ తేదీ న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జి ల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి పి.శ్రీనివాసరావు తెలిపారు.

ఒంగోలులో మాట్లాడుతున్న జడ్జి శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12న జాతీయ లోక్‌ అదాలత్‌

సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 5 : జి ల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 12వ తేదీ న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జి ల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌జడ్జి పి.శ్రీనివాసరావు తెలిపారు. శనివా రం ఒంగోలులోని న్యాయసేవాధికార సంస్థ కా ర్యాలయంలో పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరిగే లోక్‌అదాలత్‌ను కక్షిదారులకు తెలియజేసి ఎక్కువ సంఖ్యలో కే సుల పరిష్కారానికి పోలీసులు సహకరించాలని జడ్జి కోరారు. రాజీపడదగిన అన్ని క్రిమినల్‌ కే సులు, సివిల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, మోటా రు వాహన ప్రమాద బీమా, వివాహ సంబంధ కేసులు ఇరువర్గాల ఆమోదంతో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని న్యాయస్థానాల్లో చెల్లించిన ఫీ జు వాపసు పొందవచ్చునని తెలిపారు. కార్యక్ర మంలో జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు పి.గాయత్రి, బి.కనకలక్ష్మి, ఎస్సీ.కమల తదితరులు పాల్గొన్నారు. 

చీరాల: జాతీయ లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు పోలీసులు, న్యాయవాదులు తమవంతు కృషి చే యాలని మండల న్యాయసేవాధికార సంస్థ చై ర్‌పర్సన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.శుభవాణి కోరారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న జాతీ య లోక్‌అదాలత్‌ నేపథ్యంలో శనివారం చీరాల లో పోలీస్‌ అధికారులు, న్యాయవాదులతో సమా వేశం నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి ఇ.ఆంజనేయులు, అడిషన ల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.ప్రసన్నలక్ష్మి, డీఎ స్పీ శ్రీకాంత్‌, బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నే టి రవి,  పోలీసులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising