రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN, First Publish Date - 2020-11-14T03:06:23+05:30
రాచర్లలో ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీ కొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
రాచర్ల, నవంబరు 13 : మండలంలోని రాచర్లలో ఎదురెదురుగా వస్తున్న రెండు స్కూటర్లు ఢీ కొని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శుక్రవారం గంగంపల్లె గ్రామానికి చెందిన మిలటరీ ఉద్యోగి పి.వెంకటరంగయ్య రాచర్లలో మద్యం సేవించి గంగంపల్లె గ్రామానికి వెళుతుండగా తాళ్లపల్లె గ్రామానికి చెందిన షేక్ ఖాజా అనుమలవీడులో బేల్దారి పని ముగించుకుని తాళ్ళపల్లెకు వెలుతుండగా విద్వాన్‌స్కూలు సమీపంలో రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-11-14T03:06:23+05:30 IST