ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యానాదుల అభ్యున్నతికి చిత్తశుద్ధి లేమే ఆటంకం

ABN, First Publish Date - 2020-12-16T04:07:35+05:30

యానాది జాతి అభ్యున్నతికి గిరిజన శాఖ అధికారుల చిత్తశుద్ధి, వైఫల్యమై ఆటంకమని శాసనసభ్యుడు మహీధర్‌ రెడ్డి చెప్పారు.

దుప్పట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



శాసనసభ్యుడు మహీధర్‌ రెడ్డి

ఉలవపాడు, డిసెంబరు 15 : యానాది జాతి అభ్యున్నతికి గిరిజన శాఖ అధికారుల చిత్తశుద్ధి, వైఫల్యమై ఆటంకమని శాసనసభ్యుడు మహీధర్‌ రెడ్డి చెప్పారు. గిరిజన యానాదుల సమగ్ర జీవనోపాధికి సంబంధించిన విద్య, ఆరోగ్యం, సంక్షేమం, ఉపాధి అంశాలపై మం గళవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో యానాదులకు సంబంధించిన సమగ్ర సమాచారం అధికారుల వద్ద లేకపోవడాన్ని తప్పుబట్టారు. తొలుత ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కరేడు పీహెచ్‌సీ వైద్యులు కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 15 మంది డాక్టర్లు వైద్యసేవలు అందించారు. కొవిడ్‌ సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉలవపాడు సీహెచ్‌సీలో చిన్న పిల్లల వైద్యనిపుణుడు సతీ్‌షబాబును ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఎంపిక చేసిన 100 మంది గిరిజన యానాదులకు దుప్పట్లు, బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. 14 మంది గ్రామ వలంటీర్లకు ఎమ్మెల్యే  నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ యానాది పీవో మణికుమార్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి లలితాబాయి, పుష్పలత, జాయింట్‌ కలెక్టర్‌ ఆసరా కృష్ణవేణి, స్కిల్‌ డెవలె్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారి ఆర్‌ లోకనాథం, ఆడిటర్‌ అండ్‌ అకౌంట్‌ంగ్‌ అధికారి వెంటేశ్వర్లు, ఎంపీడీవో టీ రవికుమార్‌, తహసీల్దార్‌ కే సంజీవరావు, ఏంఈవో చెంచుపుల్లయ్య, వైద్యులు బాలాజీనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising