ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై భారీగా ట్రాఫిక్‌ జాం

ABN, First Publish Date - 2020-12-27T06:55:43+05:30

హైవేపై మూడు గంటలపాటు హైటెన్షన్‌ నెలకొంది.

జాతీయ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నిలిపివేసిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారీ వాహనం తగిలి తెగిపడిన హైటెన్షన్‌ తీగలు

నిలిచిపోయిన వాహనాలు

రెండు మండలాల్లో అంధకారం

ఒంగోలు(క్రైం),  డిసెంబరు 26 : హైవేపై మూడు గంటలపాటు హైటెన్షన్‌ నెలకొంది. జాతీయరహదారిపై త్రోవగుంట ఆటోనగర్‌ ఫైఓవర్‌ వద్ద శనివారం రాత్రి హైటెన్షన్‌ వైర్లు తెగిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. రాత్రి 6.30 సమయంలో ఆటోనగర్‌ ఫైఓవర్‌పై గుర్తుతెలియని భారీ వాహనం వేగంగా వెళుతూ తగలడంతో విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. అయితే వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. తెగిన వెంటనే  త్రోవగుంట, కరువది, దేవరంపాడు సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోయింది. అదేసమయంలో సంఘమిత్ర వైద్యశాల సమీపంలో రైల్వే ఫైఓవర్‌ వద్ద కూడా ఒక 33 కేవీ లైన్‌ వైర్‌ తెగిపడింది. దీంతో బాలాజీనగర్‌, కొప్పోలు, బీరంగుంట సబ్‌స్టేషన్‌ పరిధిలో సరఫరా నిలిచిపోయింది. కొత్తపట్నం, ఒంగోలురూరల్‌ మండలాల్లోని 20 గ్రామాలకు మూడు గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే ఎఫ్‌సీఐ గోడౌన్స్‌ నుంచి ఉన్న రాజీవ్‌ గృహకల్ప, ఇందిరాకాలనీ, కొప్పోలు, బీరంగుంట పరిసర ప్రాంతాల్లో కూడా అంధకారం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే విద్యుత్‌శాఖ సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవేపై వాహన రాకపోకలను నిలిపివేసి లైన్‌ మరమ్మతులు చేపట్టారు. రాత్రి 9.30 తర్వాత పరిస్థితిని చక్కదిద్దారు.




Updated Date - 2020-12-27T06:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising