ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచిన కేంద్రాల్లో వేలం పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-08-11T10:38:50+05:30

దక్షిణాదిలోని పన్నెండు పొగాకు వేలం కేంద్రాలలో సోమవారం వేలం జరిగింది. కరోనా కంటైన్మెంట్‌ జోన్ల కారణంగా కొన్నింటిలో , మార్క్‌ఫెడ్‌ గోడౌన్లు సమస్యతో మరికొన్నింటిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిలో  రూ.208 పలికిన గరిష్ఠ ధర


ఒంగోలు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): దక్షిణాదిలోని పన్నెండు పొగాకు వేలం కేంద్రాలలో సోమవారం వేలం జరిగింది. కరోనా కంటైన్మెంట్‌ జోన్ల కారణంగా కొన్నింటిలో , మార్క్‌ఫెడ్‌ గోడౌన్లు సమస్యతో మరికొన్నింటిలో దాదాపు పక్షం రోజులుగా వేలం నిలిచిపోయింది. ప్రస్తుతం కంటెన్మెంట్లు ఎత్తివేత ,గోడౌన్ల సమస్య అధిగమించడంతో తిరిగి సోమవారం వాటిలో వేలం పునః ప్రారంభమైంది. 


ఆరు కేంద్రాలున్న ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో 44,956, అలాగే మరో 6 కేంద్రాలున్న ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో 4214 వెరసి 9,160 బేళ్లను సోమవారం వేలంకు తీసుకురాగా దాదాపు 7,881 బేళ్ళు కొనుగోలు చేశారు. అలా తిరస్కరణ సంఖ్యకూడా కొంతమేర తగ్గింది.  మేలురకం బేళ్లకు ధరలు హాట్‌... హాట్‌గానే కనిపిస్తున్నాయి. అన్ని కేంద్రాలలోను గరిష్ఠ ధర కిలో రూ. 200లు పైనే ఉండగా గరిష్ఠంగా ఒంగోలు-1 కేంద్రంలోనూ కిలో రూ. 208 పలికింది. అలాగే కనిష్ఠ ధరలు కిలో రూ.75 ప్రకారం కొనుగోళ్ళు జరిగాయి.

Updated Date - 2020-08-11T10:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising