ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ప్రభుత్వ భవనాల ప్రారంబోత్సవం

ABN, First Publish Date - 2020-12-15T06:18:40+05:30

: ఎర్రగొండపాలెంలో రూ.70 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాల ప్రారంభానికి ముగ్గురు మంత్రులు హాజరుకానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగొండపాలేనికి ముగ్గురు రాష్ట్ర మంత్రుల రాక 


ఎర్రగొండపాలెం, డిసెంబరు 14: ఎర్రగొండపాలెంలో రూ.70 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాల ప్రారంభానికి ముగ్గురు మంత్రులు హాజరుకానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటీ వనితలు ముఖ్య అథిధులుగా పాల్గొంటారని తెలిపారు. మొదటగా మంగళవారం మధ్యహ్నం 3 గంటలకు యండ్రపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఎర్రగొండపాలెం చేరుకోని ఎర్రగొండపాలెం అగ్నిమాపక కేంద్రం ప్రారంభిస్తారన్నారు. అనంతరం సాయంత్రం వైకాపా పార్టీ ఆధ్వర్యంలో జరుతున్న ఐక్య క్రిస్టమస్‌ వేడుకల్లో పాల్గొంటారని పీఏ తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-12-15T06:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising