ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహంలో చోరీ

ABN, First Publish Date - 2020-12-04T05:13:31+05:30

తాళం వేసిన ఓ గృహంలో దొంగలు పడి 15 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరించిన ఘటన మండలంలోని కందులాపురం పంచాయతీ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

15 తులాల బంగారు, 2 లక్షల నగదు చోరీ

కంభం, డిసెంబరు 3 : తాళం వేసిన ఓ గృహంలో దొంగలు పడి 15 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరించిన ఘటన మండలంలోని కందులాపురం పంచాయతీ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు పెద్దిరెడ్డి నరేంద్రరెడ్డి కథనం మేరకు తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బుధవారం మంత్రాలయం వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి బీరువాలో దాచిన బంగారం నగదు అపహరించినట్లు తెలిపాడు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి బాధితునికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన మంత్రాలయం నుంచి వచ్చి చూసి వివరాలను పోలీసులకు తెలిపారు. దొంగలు మరో గదిలో ఉన్న ఇనుప బీరువాను తెరిచేందుకు ప్రయత్నించగా చేతకాక దొంగలు వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఆ బీరువాలో అధిక మొత్తంలో బంగారం నగదు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు వివరించారు.  ఒంగోలు నుంచి క్లూస్‌ టీం వేలిముద్రలను సేకరించింది. కంభం ఎస్సై మాధవరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-04T05:13:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising