ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగిన బతుకు ‘చిత్రం’

ABN, First Publish Date - 2020-05-24T09:06:03+05:30

కరోనా లాక్‌డౌన్‌ వల్ల వెండితెర రంగులు కోల్పోయింది. చిత్రాల ప్రదర్శన నిలిచిపోవడంతో థియేటర్లపై ఆధారపడి జీవనం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో థియేటర్ల మూత

లాక్‌డౌన్‌ తరువాత తెరుచుకోవడం కష్టమే

ఉపాధి లేక వందలాది కుటుంబాల ఆవేదన

ఆదుకోవాలని కార్మికుల విజ్ఞప్తి


ఒంగోలు(జడ్పీ), మే 23: కరోనా లాక్‌డౌన్‌ వల్ల వెండితెర రంగులు కోల్పోయింది. చిత్రాల ప్రదర్శన నిలిచిపోవడంతో థియేటర్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాల జీవనోపాధి కూడా దారుణంగా దెబ్బతిన్నది. జిల్లావ్యాప్తంగా 50కు పైగానే థియేటర్లు ఉండగా దాదాపు 1000 కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉన్నాయి. ప్రతి థియేటర్‌కు మేనేజర్‌తో పాటు, బుకింగ్‌ క్లర్క్‌, క్యాషియర్‌, వాచ్‌మన్‌, క్యాంటీన్‌, పార్కింగ్‌ ఇలా 20 నుంచి 25 మంది దాకా సిబ్బంది పని చేస్తుంటారు.


ప్రస్తుతం థియేటర్లు మూతపడడంతో వారందరికీ ఉపాధి లేకుండా పోయింది. లాక్‌డౌన్‌ తరువాత కూడా వెంటనే థియేటర్లు తెరిచే అవకాశం ఉండదని, వేరే మార్గాలు చూసుకోమని సిబ్బందికి యాజమాన్యాలు సూచిస్తున్నాయి. సడలింపులతో అన్ని రంగాలు పట్టాలెక్కుతున్నప్పటికీ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరిచే అవకాశం లేకపోవడంతో ఎలా బతకాలో అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ వృత్తిలోనే ఉన్నామని ఉన్న ఫళంగా వేరే దారి చూసుకోమంటే ఎలా అని వారు వాపోతున్నారు. మాకు ఎలాంటి అసోసియేషన్లు, గుర్తింపు యూనియన్లు లేకపోవడం వల్ల సినీ పెద్దల దృష్టికి తమ సమస్యలు వెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న మా లాంటి కార్మికులను ప్రభు త్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. 


సినీ పెద్దలు ఆదుకోవాలి

కరోనా సంక్షోభం వేళ సినీ కార్మికులను ఆదుకోవడానికి అగ్ర హీరోలంతా కలిసి కరోనా విపత్తు నిధి పేరిట ఓ ఛారిటీ ఏర్పాటు చేసి దానికి నిధులు సమకూరుస్తున్నారు. ఆ నిధులను సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లు కూడా జరగకపోవడంతో వారిని ఆదుకోవడానికి నిధులు సేకరిస్తున్నారు. థియేటర్లలో పనిచేసే తాము కూడా సినీ పరిశ్రమ పరిధిలోకే వస్తామని, మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవాలని సిబ్బంది వేడుకుంటున్నారు.


సగం జీతమే ఇచ్చారు..డి.బాబు, థియేటర్‌  వాచ్‌మన్‌, ఒంగోలు 

కరోనా దెబ్బకు మొత్తం జీతం ఇవ్వలేమని సగం మాత్రమే ఇచ్చారు. ఇంటి అద్దెలు, కుటుంబపోషణ మొత్తం జీతంతోనే గడవాలి. థియేటర్లు కూడా నడవకపోవడంతో వారు మాత్రం ఎక్కడ నుంచి తెచ్చిస్తారు. నాలాంటి వారిని ఆదుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మేము కూడా సినీ పరిశ్రమ కిందకే వస్తాం. సినిమారంగంలో ఉన్న పెద్దలు కూడా ఆదుకోవాలి.  


Updated Date - 2020-05-24T09:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising