ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరాలలో మరోసారి టెన్షన్ వాతావరణం..

ABN, First Publish Date - 2020-11-06T17:04:50+05:30

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితులుంటాయని ముందే గ్రహించిన పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి వర్గీయుల మధ్య జరుగుతాయనే నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ప్రజా సంకల్ప యాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చీరాలలో కరణం వెంకటేష్, ఆమంచి కృష్ణమోహన్‌లు పాదయాత్ర నిర్వహించారు. ఇప్పటికే ఈ ఇరువురి వర్గీయుల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్న సందర్భాలు కోకొల్లలు.


ఇవాళ కూడా ఆమంచి, కరణం వర్గాలు ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుగుతుండటంతో మరోసారి గొడవలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ తరుణంలో భారీగా మోహరించిన పోలీసులు రెండు వర్గాలకు విడివిడిగా రూట్లు కేటాయించారు. దేశాయిపేట నుంచి చీరాల గడియార స్తంభం సెంటర్ వరకు ఆమంచి, చీరాల గడియార స్తంభం సెంటర్ నుంచి ఈపూరుపాలెం వరకు కరణం వెంకటేష్ పాదయాత్రలో పాల్గొననున్నారు. పాదయాత్రలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు దగ్గరుండి మరీ ఎలాంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2020-11-06T17:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising