ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు ,హిందీ ఎస్‌ఏల ఉద్యోగోన్నతులు రద్దు

ABN, First Publish Date - 2020-11-30T06:25:20+05:30

జిల్లాలో ఇటీవల నిర్వహించిన తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్‌ ఉద్యోగోన్నతులను రద్దు చేస్తూ డీఈవో వీఎస్‌. సుబ్బారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలువిద్య, నవంబరు 29 : జిల్లాలో ఇటీవల నిర్వహించిన తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్‌ ఉద్యోగోన్నతులను రద్దు చేస్తూ డీఈవో వీఎస్‌. సుబ్బారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 21న నిర్వహిం చిన ఉద్యోగోన్నతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిగా పాటించలే దని పాఠశాల విద్యడైరెక్టర్‌ అభ్యంతరం తెలపడంతో వాటిని రద్దు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ తెలుగు, థర్డ్‌ మెధడాలజీ ఉన్నవారు, సింగల్‌ సబ్జెక్టు ఉత్తీ ర్ణులైన వారికి కూడా ఉద్యోగోన్నతి ఇవ్వాల్సి ఉన్నా అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం వారిని కూడా పరిగణలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశారు. స్కూలు అసిస్టెంటు తెలుగు సబ్జెక్టుకు 81 మంది, హిందీ స బ్జెక్టుకు 51 మందిని అర్హులుగా గుర్తించారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత వీరికి స్థానాలు కేటాయిస్తారు.  

Updated Date - 2020-11-30T06:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising