ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాకీ మాటున అక్రమ దందా

ABN, First Publish Date - 2020-08-10T18:40:03+05:30

తెలంగాణ మద్యం తరలిస్తూ కానిస్టేబుల్‌ పట్టుబడ్డాడు. ఈ సంఘటన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ  నుంచి మద్యం బాటిళ్ల రవాణా

మోటారు సైకిల్‌పై తీసుకువస్తుండగా ప్రమాదం

రోడ్డుపై పడి పగిలిన సీసాలు 

గుట్టురట్టయిన బాగోతం


మద్దిపాడు(ప్రకాశం): తెలంగాణ మద్యం తరలిస్తూ కానిస్టేబుల్‌ పట్టుబడ్డాడు. ఈ సంఘటన మద్దిపాడు పోలీసు స్టేషన్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుం ది. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా మా ర్టూరు మండలం రాజుపాలెం వద్ద విధులు నిర్వహిస్తున్న కిరణ్‌ తన తమ్ముడు మహేష్‌బాబు సాయంతో ఈ వ్యాపారానికి తెర తీశాడు. తెలంగాణ రాష్ట్రం న ల్గొండ నుంచి మోటారు సైకిల్‌పై 40 మద్యం బాటిళ్ళు ఒంగోలుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో  మ ద్దిపాడు సమీపంలోకి రాగానే మోటారు సైకిల్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మోటారు సైకిల్‌పై ఉన్న మద్యం బాటిళ్ళు కిందపడి ప గిలిపోగా, ఏఆర్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. మహేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.


సంఘటనాస్థలానికి మద్దిపాడు పోలీసులు చేరుకొని క్షతగా త్రులను  108 వాహనంలో వైద్యశాలకు తరలించారు. కానిస్టేబుల్‌ కిరణ్‌ 2017 లో మార్కాపురం ఓఎస్‌డీ అరెస్టు చేసిన కేసులో నిందితుడు.  ఇటీవల ఏఆర్‌ కా నిస్టేబుల్‌గా మార్టూరు మండలం రాజుపాలెం చెక్‌పోస్టువద్ద విధులు నిర్వర్తి స్తున్నారు.  పోలీసు దర్యాప్తులో ఇతను మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. దీంతో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు మద్దిపాడు ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌బాషా కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకొన్న 40 మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌కు అ ప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-08-10T18:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising