ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ఇక ఇంటికే...: లోకేష్

ABN, First Publish Date - 2020-12-29T18:35:21+05:30

2022 లో జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ఇక ఇంటికే వెళ్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: 2022లో జమిలీ ఎన్నికలు వస్తే జగన్ ఇక ఇంటికే వెళ్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్ త్రిపురంతాకం మండలం మేడపిలో నివర్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన మిర్చి రైతులతో మాటా మంతి నిర్వహించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు ఎకరాకు లక్షల్లో నష్టపోయామని  లోకేష్ దృష్టికి రైతులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ‘‘నేను చూశాను.. నేను విన్నాను అన్న వచ్చాడు.. అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏమి పీకాడు..ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గాల్లో తిరుగుతాడు.. వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డాన్సులు చూస్తాడు. ఏపీలో ఇంత దరిద్రపు పాలన ఎప్పుడు చూడలేదు..అసెంబ్లీలో చంద్రబాబు ప్రశ్నిస్తే అప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేశారు..రైతు కోసం అంటూ నేను యాత్రకు వస్తే అప్పుడు ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు సాయం చేస్తారు..వీళ్లకు రికార్డింగ్ డాన్సులు చూడటానికి సమయం ఉంటుంది కానీ రైతుల గురించి పట్టించుకోవటానికి సమయం లేదు..రైతు రాజ్యం అని చెప్పుకునే వైసీపీ నేతలు గ్రామాల్లో రౌడీ రాజ్యం స్థాపిస్తున్నారు..ముళ్ళు కర్రతో కొడితే కానీ ముఖ్యమంత్రి కదిలేలా లేరు..పాదయాత్రలో పెంచుతూ పోతా అన్న ముఖ్యమంత్రి.. సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటే అన్నీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు..1983లో ఎన్టీఆర్ రైతులకు నిజమైన స్వాతంత్ర్యం తీసుకువస్తే..ఇప్పుడు వచ్చిన ఈ దున్నపోతు ముఖ్యమంత్రి అది లాగేసుకోవాలని చూస్తున్నారు..ముఖ్యమంత్రి రైతుల పొలాలకు మీటర్లు పెడితే ఆ షాక్ మీకే కొడుతోంది..గతంలో రైతులకు డ్రిప్, స్ప్రేయర్, విత్తనాలు ఏవి కావాలన్నా అడగకుండానే వచ్చేవి.. ఇప్పుడు మొత్తుకున్నా ఏవి దొరకటం లేదు..ముఖ్యమంత్రిగా జగన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లలో రైతులు ఎప్పుడు చూడని నష్టాన్ని చూశారు.. అంత దరిద్రపు పాదం ఆయనది..అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పటం.. మడమ తిప్పటం తప్ప ఆయన చేసిందేమీ లేదు..జగన్ రెడ్డి ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి గా ఉంటారో ఆయనకే తెలియదు..2022 లో జమిలీ ఎన్నికలు వస్తే ఇంక ఆయన ఇంటికే’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు. 


అంతుకుముందు లోకేష్ ముందు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.  వరి పంటకు కూడా భారీ వర్షాల అనంతరం తెగుళ్ళతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇంత జరిగినా ఇంతవరకూ అధికారులు ఎవరు తమ దగ్గరకు వచ్చి వాటిల్లిన నష్టం గురించి సమాచారం కూడా తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయని చెప్పుకొచ్చారు. రైతులు సంతోషంగా ఉన్నారని చెబుతున్న వైసీపీ నేతలు రైతుల పొలాల వద్దకు వస్తే వారు ఎలా ఉన్నారో నిరూపిస్తామని రైతులు సవాల్ విసిరారు. 

Updated Date - 2020-12-29T18:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising