టీడీపీతోనే సామాజిక న్యాయం
ABN, First Publish Date - 2020-12-29T04:30:57+05:30
టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్య మని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం, డిసెంబరు 28: టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్య మని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్ట ణంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీర బ్రహ్మం అధ్యక్షతన సోమవారం మార్కాపురం, తర్లుపాడు మం డలాల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సం ద ర్భంగా కందుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజ ధాని అమరావతికి కులం రంగు పులిమి మూడుగా విభజిస్తు న్నార న్నారు. టీడీపీ హయాంలోనే అన్ని వర్గాల వారికి తగిన గుర్తింపు లభిం చిందన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో కేవలం రెడ్డి సామాజికవర్గానికే ఉన్నత స్థాయి పదవులు కట్టబెడుతూ బడుగు, బలహీనవర్గాల వారిని చిన్నచూపుచూస్తున్నారని విమర్శించారు. ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని సూచించారు. విభే టదాలను పక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వక్క లగడ్డ రాధికా మల్లికార్జున్, పార్టీ పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి వెంకట సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, కనిగిరి బా ల వెంకటరమణ, కంచర్ల కాశయ్య, పులివేముల ఏసుదాసు, టీడీపీ మం డల అధ్యక్షుడు ఉడుముల చిన్నపరెడ్డి, రెండు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T04:30:57+05:30 IST