ఏమైందో ఏమో.. ఉదయం చూసేసరికి ఓ వివాహిత..
ABN, First Publish Date - 2020-12-11T06:02:49+05:30
: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన మండలంలోని కేఎ్‌సపల్లె గ్రామంలో జరిగింది.
గిద్దలూరు టౌన్, డిసెంబరు 10 : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందిన ఘటన మండలంలోని కేఎ్‌సపల్లె గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పద్మావతి (45) కూలి పని చేసుకుని జీవిస్తోంది. బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న పద్మావతి ఉదయం చూసేసరికి మృతిచెంది కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సీఐ యు.సుధాకర్‌రావు, ఎస్‌ఐ రవీంద్రరెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.
Updated Date - 2020-12-11T06:02:49+05:30 IST