ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-29T06:43:51+05:30

రైతులను ఆదుకోవాలి

ఏలూరి సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు ఏలూరి లేఖ

దెబ్బతిన్న పంటలను  ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించాలని వినతి

పర్చూరు, నవంబరు 28: నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న పంటలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించి నష్టపరిహారం అం దించి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ బాప ట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జరిగిన నష్టాలపై వీడియోను కూడా  పంపారు. తుఫాన్‌ కారణంగా వేల ఎకరాల్లో మిర్చి, వరి, పొగాకు, శనగ, మినుము, కూరగాయల పంటలు నీట ముని గాయన్నారు. మిర్చి రైతులు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేశారన్నా రు. అదేవిధంగా వైట్‌బర్లీ, ప్రత్తి పంటలకు అపారనష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి రైతులకు భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించి పెద్దఎత్తున రైతాంగానికి ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని లేఖలో కోరారు. ప్రకాశం జిల్లాలో వర్షాలతో భారీనష్టం వాటిల్లిందని, 35 మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.  వర్షాలకు రోడ్లు కూడా ధ్వంస మయ్యాయని, సీఎం స్వయంగా పర్యటించి అన్నదాతలను ఆదుకో వాలని ఆయన కోరారు. 


Updated Date - 2020-11-29T06:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising