ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీకి భూముల పరిశీలన

ABN, First Publish Date - 2020-10-23T11:05:49+05:30

దొనకొండ ప్రాంతంలో ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటు నిమిత్తం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొనకొండ, అక్టోబరు 22 : దొనకొండ ప్రాంతంలో ఎయిర్‌ ఫోర్స్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటు నిమిత్తం అనుకూలమైన ప్రభుత్వ భూములను సూర్యలంక ఎయిర్‌ ఫోర్స్‌ అధికారుల బృందం గురువారం పరిశీలించింది. చీఫ్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి జి.శ్రీనివాస్‌, వెంకటే్‌షబడ్డే, మహేంద్ర దొనకొండలోని పలు ప్రాం తాల్లోని భూముల్లో పర్యటించారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ  తరగతుల కేంద్రం ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలు పరిశీలించారు. బాదాపురం, ఇండ్లచెరువు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పరిశీలించారు. 1400 ఎకరాల భూముల్లో మూడు కిలోమీటర్ల రన్‌వే ఏర్పాటుకు కొండలు, గుట్టలు లేకుండా సమతలంగా ఉన్న భూములు ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతం సౌకర్యవంతంగా ఉన్నట్లు  గుర్తించి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ మ్యాప్‌ ద్వారా వారికి అవగాహన కల్పించారు. పురాతన ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌, జాతీయ రహదారి తదితర అనుకూలతలను వారికి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు, మండల సర్వేయర్‌ దర్శన్‌, లైసెన్స్‌ సర్వేయర్‌ సీహెచ్‌ వెంకటరావు, వీఆర్వోలు పాల్గొన్నారు. 


అర్హులందరికీ ఇంటి స్థలాలు

సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ

ముండ్లమూరు, అక్టోబరు 22 :  ఇల్లు లేని నిరుపేదలందరికీ నివేశన స్థలాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ అన్నారు. గురువారం ఆయన ముండ్లమూరులోని సింగన్నపాలెం రోడ్డులో పేదలకు ఇస్తున్న నివేశన స్థలాలను పరిశీలించారు. అనంతరం ఆయన తహసీల్దార్‌తో మాట్లాడారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన ఇల్లులేని పేదలందరికీ మెదటి జాబితాలోనే నివేశన స్థలాలు అందజేయాలన్నారు. అనంతరం పోలవరంలో రైతు భరోసా కేంద్రం స్థలంతోపాటు కన్వర్షన్‌ భూములను పరిశీలించారు ఆయన వెంట తహసీల్దార్‌ పి.పార్వతి, ఆర్‌ఐ స్రవంతి, సర్వేయర్‌ షఫీ, వీఆర్వోలు మురళి, బ్రహ్మతేజ ఉన్నారు.


డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన 

దర్శి  : దర్శి నగర పంచాయతీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గురువారం సబ్‌ కలెక్టర్‌ భార్గవ్‌తేజ పరిశీలించారు. దర్శి-కురిచేడు రోడ్డులో మోడల్‌స్కూల్‌ పక్కన ఉన్న దర్శి రెవెన్యూ 152 సర్వేనెంబరులో అధికారులు గుర్తించిన ఆరు ఎకరాల స్ధలాన్ని ఆయన పరిశీలించారు. వచ్చే జూన్‌లో కళాశాల ప్రారంభించేందుకు, నూతన భవనాల నిర్మాణానికి ఈ స్ధలాన్ని సేకరించారు. సబ్‌కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ డీవీబీ వరకుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, సర్వేయర్‌రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising