ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడ్డుకట్ట వేయాలి : టీడీపీ

ABN, First Publish Date - 2020-09-18T07:44:04+05:30

పేదల ఆకలి తీర్చేందుకు ప్ర భుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తున్న డీలర్లు, రాజకీయ నాయకుల మాఫీయాను అరికట్టాలని తెలుగుదేశం పార్టీ నా యకులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 17 : పేదల ఆకలి తీర్చేందుకు ప్ర భుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తున్న డీలర్లు, రాజకీయ నాయకుల మాఫీయాను అరికట్టాలని తెలుగుదేశం పార్టీ నా యకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఒంగోలులో డీఎస్‌వో వెంకటే శ్వర్లును కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పలువురు బియ్యం మా ఫీయాలుగా మారి చెలరేగిపోతున్నారని, మద్దిపాడు, కొండపి, ఒంగోలు, చీమకుర్తి, కందుకూరు కేంద్రాలుగా అక్రమంగా బియ్యం తరలిస్తున్నా రని ఆరోపించారు.


ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు గ్రోత్‌సెం టర్‌, మేదరమెట్లలో రైస్‌ మిల్లు నడుపుతూ నగరానికి చెందిన తమ పా ర్టీకి చెందిన కొంతమందిని ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా అక్రమ బియ్యం వ్యా పారాన్ని అడ్డుకోవాలని కోరారు.


కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధానకా ర్యదర్శి గుర్రాల రాజ్‌విమల్‌,  నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, పెళ్ళూరి చినవెంకటేశ్వర్లు, పా తూరి పుల్లయ్యచౌదరి, నావూరి కుమార్‌, కసుకుర్తి అంకరాజు, కె.లక్ష్మి, చుండి శ్యాం, చావల సురేష్‌, రాము, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-18T07:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising