పకడ్బందీగా 144 సెక్షన్ అమలు
ABN, First Publish Date - 2020-03-27T10:17:10+05:30
కరోనా కట్టడి కోసం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు ఎస్‌ఐ దాసరిరాజారావు చెప్పారు.
సంతనూతలపాడు, మార్చి 26 : కరోనా కట్టడి కోసం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు ఎస్‌ఐ దాసరిరాజారావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గురువారం ప్రైవేట్ వాహనదారులు కొందరు రోడ్లపైకి రావడంతో ఎస్‌ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. 10 మంది ద్విచక్ర వాహనదారులకు రూ.5వేల జరిమానా విధించారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలకు బయటకు రావద్దని, లాక్‌డౌన్‌కు అందరు సహకరించాలని ఎస్‌ఐ రాజారావు కోరారు.
Updated Date - 2020-03-27T10:17:10+05:30 IST