ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూబీకి సెల్యూట్

ABN, First Publish Date - 2020-10-04T17:23:43+05:30

పోలీసు శాఖలో ఏడేళ్లపాటు సేవలందించిన జాగిలం (స్కూబీ) అనారోగ్యంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనారోగ్యంతో పోలీసు జాగిలం మృతి

ఒంగోలులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు


ఒంగోలు: పోలీసు శాఖలో ఏడేళ్లపాటు సేవలందించిన   జాగిలం (స్కూబీ) అనారోగ్యంతో మృతి చెందింది. దీనికి పోలీసులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 2012 డిసెంబరు 26న జన్మించిన స్కూబీ పది నెలలపాటు పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్సీ ట్రైనింగ్‌ అకాడమీలో శిక్షణ పొందింది.  2013 డిసెంబరులో జిల్లాకు దీన్ని కేటాయించారు. దీనికి ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వై. రామిరెడ్డి హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తున్నారు.


పోలీసు శాఖకు స్కూబీ అనేక సందర్భాల్లో ఉపయోగపడింది. వీఐపీల పర్యటనల సందర్భంగా బందోబస్తు నిర్వహణలో అమూల్యమైన సేవలు అందించింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఈ జాగిలం శనివారం మృతి చెందింది. స్కూబీ కళేబరాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు శిక్షణ కేంద్రం వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. అక్కడ అధికారిక లాంఛనాలతో  ఖననం చేశారు.  అంతిమయాత్రలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, మార్కాపురం ఓఎ్‌సడీ కె. చౌడేశ్వరి, ఏఆర్‌ డీఎస్పీ కె. రాఘవేంద్రరావు, సీఐలు వి. సూర్యనారాయణ, ఎం. భీమానాయక్‌, ఆర్‌. రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-04T17:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising