ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ బోల్తా - ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2020-12-04T05:11:15+05:30

గొర్రెల తీసుకొని వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని ముడివేముల సమీపంలో 544 డీ జాతీయ రహదారిపై గురువారం జరిగింది.

ప్రమాదస్థలంలో మృతులు, క్షతగాత్రులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురికి తీవ్రగాయాలు

27 గొర్రెలు మృత్యువాత

ముందున్న ట్రాక్టర్‌ అకస్మాత్తుగా ఆగడంతో ఘటన

త్రిపురాంతకం, డిసెంబరు 3 : గొర్రెల తీసుకొని వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన ఘటన మండలంలోని ముడివేముల సమీపంలో 544 డీ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. లారీ ముందు వైపు వేగంగా వెళుతున్న ట్రాక్టరు అకస్మాత్తుగా ఆగడంతో  దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ పమ్రాదంలో లారీలో ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 27 గొర్రెలు మృతి చెందాయి. 

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురానికి చెందిన 10 మంది పెద్దారవీడు మండలం కుంటలోని సంతలో గొర్రెలను కొనుగోలు చేశారు. వాటిని లారీలో ఎక్కించి కైకలూరు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముడివేముల సమీపంలో లారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బయ్యా నాగరాజు(48), బండి రాంబాబు(35) మృతి చెందారు. పల్లంరాజు, నాగేశ్వరరావు, సూరిబాబు, వీరబాబు, గోగయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట కృష్ణయ్య సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని స్థానికులతో కలిసి  సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఇరుకున్న మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో వినుకొండ వైద్యశాలకు తరలించారు. మార్కాపురం డీఎస్పీ కిషోర్‌కుమార్‌, వైపాలెం సీఐ పి.దేవప్రభాకర్‌, తహసీల్దారు వి.కిరణ్‌  ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.



Updated Date - 2020-12-04T05:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising