ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా రోడ్లు.. ప్రజల అవస్థలు

ABN, First Publish Date - 2020-12-02T05:22:22+05:30

నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాలు జల మయమయ్యాయి.

అయిషా మసీదు వద్ద రోడ్డు దుస్థితి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మార్కాపురం పట్టణంలోని పలు ప్రాంతాలు జల మయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మా రింది. మరికొన్ని వీధులు బురదమయమయ్యాయి. పట్టణంలోని రాజ్యలక్ష్మీనగర్‌, మల్లారెడ్డి కాలనీ, కొండేపల్లి రోడ్డు, భగత్‌ సింగ్‌ కాలనీ, బాపూజీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, డ్రైవర్స్‌ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎరుకల కాలనీ, రెవెన్యూనగర్‌లతో పాటు పట్టణంలోని దత్తసాయి గుడి తదితర ప్రాంతాల్లో వీధులు అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మధ్య వర్షపు నీరు చేరింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు చాలా రోజులు నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తాయని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మూడు రోజు లుగా ఎడెతిరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పలు సిమెంట్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. 

- మార్కాపురం (వన్‌టౌన్‌)








Updated Date - 2020-12-02T05:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising