లారీ ఢీకొని నర్సింగ్ విద్యార్థిని మృతి
ABN, First Publish Date - 2020-12-02T03:59:19+05:30
అద్దంకిలో రోడ్డు దాటుతున్న యువతిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
అద్దంకి, డిసెంబరు 1 : రోడ్డు దాటుతున్న యువతిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన పాలెపోగు లూథియా(20) ఒంగోలులో నర్సింగ్ చదువుతోంది. లాక్‌డౌన్‌తో కళాశాల లేకపోవడంతో మేదరమెట్లలోని ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తోంది. లూథియా అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వచ్చి వెళ్తుంటుంది. మంగళవారం జీ తం తీసుకున్న లూథియా తండ్రి వద్దకు వెళ్లేందుకు మంగళవారంరాత్రి ఎన్టీఆర్‌నగర్ వద్ద ఆటోలో దిగింది. తండ్రి సుబ్బారావు రెండో వివాహం చేసుకొని షామిల్ నిర్వహిస్తుండగా అక్కడకు వెళ్లేందుకు నామ్ రోడ్డు దాటుతుండగా శింగరకొండ వైపు నుంచి అద్దంకి పట్టణంలోకి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఆమె శరీరం ఛిద్రమైంది. ప్రమాదానికి కారణమైన లారీ నిలపకుండా వెళ్లగా భవానీసెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-12-02T03:59:19+05:30 IST