ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఐ దంపతుల కుమారుడిపై విష ప్రయోగం..!

ABN, First Publish Date - 2020-08-14T15:08:08+05:30

24 గంటల వ్యవధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుశీల దంపతుల ఆత్మహత్య మరువక ముందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ఐ సుశీల భర్తది హత్యా..? ఆత్మహత్యా..?

దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు


గిద్దలూరు(ప్రకాశం): 24 గంటల వ్యవధిలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సుశీల దంపతుల ఆత్మహత్య మరువక ముందే తాజాగా ఆమె కుమారుడిపై విషప్రయోగం జరిగింది. ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు తెలిసింది. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో నివాసముంటున్న  ఆర్‌ఐ నుసుం సుశీల, ఆమె భర్త గూడ నారాయణరెడ్డి ఇద్దరి కుమారులతో  నివాసముంటున్నారు. నారాయణరెడ్డి ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. మరుసటి రోజు భర్త ఆత్మహత్యను జీర్ణించుకోలేక భార్య సుశీల కూడా ఆత్మహత్య చేసుకున్నారు. భర్త నారాయణరెడ్డి మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


నారాయణరెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఎవరెవరు ఇంట్లో ఉన్నారు, ఆ సమయంలో ఎవరి రాకపోకలు జరిగాయి, భార్య  సుశీల ఎక్కడ ఉన్నారు అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణరెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఆత్మహత్యకు దారితీశాయా అని లోతుగా పోలీసులు విశ్లేశిస్తున్నారు. నారాయణరెడ్డి మృతి అనం తరం ఆఘమేఘాల మీద భార్య అతని మృత దేహాన్ని ఆటోలో తీసుకుని వెల్లడంపై కూడా అను మానాలు వస్తున్నాయి. ఆటోలో భర్త శవాన్ని తీసుకు వెళ్తుండగా, రాచర్ల సమీపంకు వెళ్లే వరకు గిద్దలూరు సీఐ సుధాకర్‌రావు వెంబడించి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ కోణాలలో దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆర్‌ఐ సుశీల కూడా ఆత్మహత్య చేసుకోవడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 


ఓ పక్క భర్త, మరో పక్క భార్య 24 గంటల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తించింది. ఇదిలావుండగా ఆర్‌ఐ సుశీల దంపతులకు 4 ఏళ్ల నితిన్‌బాలహుస్సేన్‌రెడ్డి,  ఏడాదిన్నర రేవంత్‌రెడ్డి పిల్లలున్నారు. తల్లి ఆత్మహత్య అనంతరం బుధవారం నితిన్‌బాలహుస్సేన్‌రెడ్డి శానిటైజర్‌ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాలుడికి శానిటైజర్‌ ఇచ్చి ఆత్మహత్య చేసేందుకు వారి ఇరువురి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రయత్నించారా, లేదా,  నారాయణరెడ్డి ఆత్మహత్య సమయంలో ఆ బాలుడి కంట ఏమైనా కనపడిందా.. అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. 


Updated Date - 2020-08-14T15:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising