బాణాసంచా విక్రయాలపై ఆంక్షలు
ABN, First Publish Date - 2020-11-14T02:44:19+05:30
బాణాసంచా విక్రయదారులు మాత్రం శబ్ధకాలుష్యం, వాతావరణ కాలుష్య టపాసులను బహిరంగంగానే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
కంభంలోని బాణాసంచా విక్రయ కేంద్రం
అధిక ధరలతో జేబులు ఖాళీ
కంభం, నవంబరు 12 : కాలుష్య రహిత టపాసులు మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా బాణాసంచా విక్రయదారులు మాత్రం శబ్ధకాలుష్యం, వాతావరణ కాలుష్య టపాసులను బహిరంగంగానే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు బాణాసంచా విక్రయాలను నిలిపేశాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 గంటలు మాత్రమే బాణాసంచా వినియోగానికి అనుమతులు ఇచ్చింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది. దీంతో బాణాసంచా వ్యాపారులకు పూర్తిగా బ్రేక్ పడినట్లేనని అంతా భావించారు. కానీ ఈ ఆంక్షలను బేఖాతరు చేసిన వ్యాపారులు అన్ని రకాల టపాసులను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Updated Date - 2020-11-14T02:44:19+05:30 IST