ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రబీలో ‘ఈ-పంట’ వేగవంతం

ABN, First Publish Date - 2020-11-21T05:37:27+05:30

ప్రస్తుత రబీ సీజన్లో సాగువివరాలను ఈ-పంట యా ప్‌లో నమోదు చేసే కార్యక్రమం ప్రారంభమ యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఇప్పటి వరకు 2,450 హెక్టార్ల  పంటల నమోదు

 

ఒంగోలు(జడ్పీ), నవంబరు 20: ప్రస్తుత రబీ సీజన్లో సాగువివరాలను ఈ-పంట యా ప్‌లో నమోదు చేసే కార్యక్రమం ప్రారంభమ యింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 2,42,997 హెక్టార్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 31,345 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేశారని వ్యవసాయశాఖ అధికారులు తెలిపా రు. ప్రధానంగా వరి 10,318, మినుము 9,743, శనగ 2545 హెక్టార్లలో సాగు చేశారు. జిల్లాలో ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని స ంబంధిత సిబ్బంది వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, ఎంపీఈవోలు ప్రధాన భూమిక పోషిస్తు న్నారు. ఇప్పటి వరకు 2,450 హెక్టార్లను ఈ-పంటలో నిక్షిప్తం చేయడం జరిగిందని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఖరీఫ్‌ ఆల స్యంగా మొదలైనప్పటికీ నమోదులో 95 శా తం మేర లక్ష్యాన్ని చేరుకున్నామని, రబీలో 100 శాతం నమోదే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకున్నామని వెల్లడించారు. 


నమోదు చేసుకుంటేనే.


రైతులు తమ పంటల వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకుడి పర్యవేక్షణలో ఈ- పంట యాప్‌లో తప్పనిసరిగా నమోదు చే యించుకోవాలి. నమోదు చేసుకోని వారికి ప్ర భుత్వ పథకాలు ఏవీ అందవని, కనుక నమో దులో నిర్లక్ష్యం తగదని అధికారులు చెబుతు న్నారు. పంటల బీమా పరిహారం దగ్గర నుం చి కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఉత్పత్తు లను మద్దతు ధరకు అమ్ముకునే వరకు ఈ-పంటే ప్రామాణికం. ఖరీఫ్‌ సీజన్‌లో న మోదు చేసుకోని రైతులు సైతం రబీలో న మోదు చేయించుకోవాలన్నారు. సీసీఆర్‌సీ కా ర్డులు ఉన్న కౌలు రైతులు సైతం వివరాలను పొందుపరచుకోవాలి. అందుబాటులో లేని రైతులు రైతు భరోసా కేంద్రంలో ఉన్న వ్య వసాయ సహాయకుడికి వివరాలు తెలిపి ప్ర క్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.  

Updated Date - 2020-11-21T05:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising