ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ కేంద్రాల పెంపు

ABN, First Publish Date - 2020-03-30T10:07:26+05:30

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలను పెంచాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ఉన్న వాటికి అదనంగా నియోజ కవర్గానికి ఒకటి ఏర్పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు 

సత్వర చర్యలు తీసుకోవాలి

పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి 

నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం 

కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశం 

అధికారులతో అత్యవసర సమావేశం


ఒంగోలు (జడ్పీ), మార్చి 29 : జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాలను పెంచాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తు తం ఉన్న వాటికి అదనంగా నియోజ కవర్గానికి ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన భవనంలో అధికారులతో ఆ యన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ జిల్లాలో నాలుగు క్వారంటైన్‌ కేంద్రాలు నడుస్తు న్నాయని చెప్పారు.


అదనంగా గిద్దలూరు, కంభం, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, పర్చూరు ప్రాంతాల్లో ఏర్పా టు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడ పారిశుధ్య పనులు శరవేగంగా చేపట్టాలని, అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉండాల న్నారు. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్ప ష్టం చేశారు.  ఈ సమావే శంలో జేసీ  ఎస్‌. షన్మోహన్‌, డీఆర్వో వెంకట సుబ్బయ్య, ప్రత్యే క కలెక్టర్‌ గంగాధ ర్‌గౌడ్‌ తదితర అధి కారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising