ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2020-12-06T05:33:26+05:30

ఎల్‌ఐసీతో పాటు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఐసీఈయూ) నెల్లూరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌. నగేష్‌ అన్నారు.స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగుల వార్షిక సమావేశం శనివారం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న నగేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, డిసెంబరు 5: ఎల్‌ఐసీతో పాటు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌  యూనియన్‌ (ఐసీఈయూ) నెల్లూరు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌. నగేష్‌ అన్నారు.స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయంలో ఉద్యోగుల వార్షిక సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నగేష్‌ మాట్లాడుతూ ఎల్‌ఐసీని లిస్టింగ్‌ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టాలని, ఇందుకు ఉద్యోగులు, ఏజెంట్లు, పాలసీదారులతో పాటు ఇతర రంగాల వారిని కలుపుకుని పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేస్తున్నదని, దేశ ప్రజలు ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో ఐసీఈయూ నెల్లూరు డివిజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి. శ్రీనివాసరావు, యూనియన్‌ నాయకులు సిహెచ్‌ ఫణీంద్ర, పద్మనాభం, సీఐటీయూ నాయకులు ఎస్‌ఏ గౌస్‌ తదితరులు పాల్గొన్నారు. 

నూతన కమిటీ ఎన్నిక 

ఈ సందర్భంగా యూనియన్‌ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీజీఎల్‌ ఈశ్వర్‌, కార్యదర్శిగా ఎస్‌వీఎస్‌ మల్లిఖార్జునరావు, ఉపాధ్యక్షుడిగా పి. బాలాజీ, సంయుక్త కార్యదర్శులుగా ఎస్‌కె షబ్బీర్‌, ఎం. సుకుమార్‌, కోశాధికారిగా ఎస్‌. రాఘవరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Updated Date - 2020-12-06T05:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising