ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు సముద్రస్నానాలు నిషేధం

ABN, First Publish Date - 2020-11-30T06:20:19+05:30

కరోనా నేపథ్యంలో కార్తీక పౌ ర్ణమి రోజున సముద్రస్నానాన్ని నిషేధించినట్లు పోలీసుశాఖ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



 

ఒంగోలు(కల్చరల్‌), నవంబరు 29 : కరోనా నేపథ్యంలో కార్తీక పౌ ర్ణమి రోజున సముద్రస్నానాన్ని నిషేధించినట్లు పోలీసుశాఖ పేర్కొంది. కార్తీక పౌర్ణమి ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యా హ్నం వరకు ఉంది. దీంతో కార్తీక దీపోత్సవాన్ని ఆదివారం రాత్రి, స ముద్రస్నానాన్ని సోమవారం ఉదయం నిర్వహించాలని పండితులు పే ర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తీరప్రాంతాల్లో సముద్రస్నానాల ను ఆచరిస్తారు. అయితే కరోనా కారణంగా ఈ సంవత్సరం స ముద్రస్నానానికి ప్రజలు ఎవరూ రావద్దని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉ న్నందున ప్రజలు ఎవరి ఇళ్లవద్ద వారే పౌర్ణమి స్నానాలు ఆచరించా లన్నారు. ఇదేవిధంగా మిగతా ప్రాంతాలలోను ఆయా ప్రాంత పోలీసు అధికారులు సముద్రస్నానాలపై నిషేధాజ్ఞలను జారీ చేశారు. 

చీరాల: కరోనా నేపథ్యంలో చీరాల, వేటపాలెం, చినగంజాం మ ండలాల పరిధిలోని సముద్ర స్నానాలు నిషేధించినట్లు డీఎస్పీ శ్రీకాం త్‌ తెలిపారు.  డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంపులుగుంపులుగా సముద్రస్నానాలు ఆచరిస్తే కరోనా వాప్తి చెందే అవకాశం ఉన్న దృ ష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనల మేరకు తీరంలో పూజలు చేసుకోవచ్చని డీఎస్పీ సూచించారు. 


Updated Date - 2020-11-30T06:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising