ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఫలితాలు తారుమారైతే పిట్ట కథలు, సినిమా కథలా!

ABN, First Publish Date - 2020-07-15T18:10:23+05:30

జిల్లాలో 27 వేలకు పైగా కరోనా పరీక్షల ఫలితాలు తారుమారై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కష్టపడి పనిచేసే వారు కావాలి

ఎమ్మెల్యే ఏలూరి  సాంబశివరావు


పర్చూరు(ప్రకాశం): జిల్లాలో 27 వేలకు పైగా కరోనా పరీక్షల ఫలితాలు తారుమారై గందరగోళ పరిస్థితులు నెలకొని ఉంటే పిట్ట కథలు, సినిమా స్టోరీలు చెప్పి బాధ్యతను మరిచి విస్మరించడం తగదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. జిల్లాలో ముగ్గురు జాయింట్‌ కలెక్టర్‌ క్యాడర్‌ అధికారులు, 20 మందికి పైగా సమర్థంగా పనిచేసే అధికారులు, వేలాది మంది క్షేత్ర స్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేస్తుండగా వేలాది కరోనా పరీక్షల కిట్లు తారుమారు కావడం విచారకరమని తెలిపారు.


ఈ విషయంలో దేశంలోనే  జిల్లాకు చెడ్డపేరు వచ్చిందని వివరించారు. కేవలం కలెక్టర్‌ బాధ్యతారాహిత్యం వల్ల ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కలెక్టర్‌కు అంత ఉత్సాహం ఉంటే సినిమాలో చెప్పిన విధంగా బాధ్యతలు అప్పగించేందుకు సీఎం, జిల్లా మంత్రికి తెలియజేస్తే వారే  మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని పేర్కొన్నారు. ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు తదితర పట్టణాలు వందకుపైగా గ్రామాల్లో  వందల మంది పోలీసులు, ఆరోగ్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు అహర్నిశలు శ్రమిస్తుంటే కరోనా పరీక్ష ఫలితాల్లో గందరగోళం సృష్టించి వారి కష్టాన్ని బూడిదలో పోశారని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2020-07-15T18:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising