ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 వేల ఎకరాల్లో పంటల నష్టం

ABN, First Publish Date - 2020-12-04T05:02:28+05:30

దర్శి ప్రాంతంలో అకాల వర్షం వ లన అంచనాలకు మించి నష్టం వాటిల్లింది. సుమారు 4 వేల ఎకరాల్లో వరి, కంది, పత్తి, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయి.

వర్షం నీరు నిల్వ ఉండటంతో ఉరకెత్తిన మిరపతోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దర్శి, డిసెంబరు 3:  దర్శి ప్రాంతంలో అకాల వర్షం వ లన అంచనాలకు మించి నష్టం వాటిల్లింది. సుమారు 4 వేల ఎకరాల్లో వరి, కంది, పత్తి, మిర్చి, పొగాకు తదితర పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం మీద రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. బోర్లకింద సాగు చేసిన వరిపంట అనేక గ్రామాల్లో కోసి ఓదెలు వేశారు. పలు గ్రా మాల్లో పంట కోతకొచ్చింది. ఒదెలు తడవడంతో పాటు కోతకొచ్చిన వరిపంట నేలకొరిగిన విషయం తెలిసిందే.. దీంతో పొలాల్లోని ఓదెలను హడావుడిగా కల్లాలు చేసి ఇండ్ల వద్ద ఆరబెట్టుకుంటున్నారు. మిర్చి తోటల్లో నీరు ని ల్వ ఉండడంతో ఉరకెత్తి చెట్లు అధికశాతం ఎండిపోయా యి. పొలాల్లో నీరు బయటకు వెళ్లబెట్టి మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి మబ్బులు కమ్మి చిరుజల్లులు పడుతుండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. మళ్లీ వర్షం వస్తే చేతికొచ్చిన పంట పూర్తిగా నీటిపాలవుతుందని అన్నదాతలు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. 


Updated Date - 2020-12-04T05:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising