బిల్లు లేకుండా సరుకు అమ్మితే కేసులు
ABN, First Publish Date - 2020-10-04T10:22:32+05:30
ముడిరాయి గానీ, స్లాబులు గానీ రవాణా చేస్తే కేసులు తప్పవని అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బల్లికురవ ఈర్లకొండ వద్ద, వేమవరంలోని గ్రానైట్, క్వారీ యజమానులతో సీఐ సమావేశం నిర్వహించారు.
గ్రానైట్, క్వారీల యజమానులకు సీఐ సూచన
బల్లికురవ, అక్టోబరు 3 : ముడిరాయి గానీ, స్లాబులు గానీ రవాణా చేస్తే కేసులు తప్పవని అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం బల్లికురవ ఈర్లకొండ వద్ద, వేమవరంలోని గ్రానైట్, క్వారీ యజమానులతో సీఐ సమావేశం నిర్వహించారు. గ్రానైట్ అక్రమ రవాణాతో ప్రభుత్వానికి కోట్లలో నష్టం జరుగుతోందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు మార్గాల్లో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు
. సరైన బిల్లు, అనుమతి పత్రాలతో గ్రానైట్‌ను తరలించేందుకు యజమానులు సహకరించాలని సీఐ సూచించారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. గ్రానైట్ ఫ్యాక్టరీ, క్వారీ యజమానులు మాట్లాడుతూ వరుస దాడులతో పరిశ్రమలు కుదేలవుతున్నాయని అన్నారు. ఎవరో చేసిన తప్పుకు మరికొందరు నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్‌ఐ శివనాంచారయ్య, క్వారీ, గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి, చిట్టిపోతు మస్తానయ్య, తిరుపతిరెడ్డి, సురేష్, సత్యనారాయణ, గోరంట్ల రవికుమార్, సుధాకర్, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T10:22:32+05:30 IST