ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునాదుల్లోనే పక్కా గృహాలు

ABN, First Publish Date - 2020-09-25T11:32:24+05:30

దర్శి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిద దశల్లో నిర్మాణాల్లో ఉన్న పక్కా గృహలు మధ్యలో నిలచిపోయాయి. బి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెండేళ్లుగా నిలిచిపోయిననిర్మాణాలు

 అందని పెండింగ్‌ బిల్లులు 

 లబ్ధిదారుల అవస్థలు


దర్శి, సెప్టెంబరు 24: దర్శి నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిద దశల్లో నిర్మాణాల్లో ఉన్న పక్కా గృహలు మధ్యలో నిలచిపోయాయి. బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. 2016 నుండి 2019 వరకు దర్శి నియోజ కవర్గంలో మొత్తం 5690 గృహలు మంజూరయ్యాయి. వీటిలో 3266 గృహల నిర్మాణం పూర్తి చేశారు. 505 గృహల నిర్మాణం వివిద దశల్లో నిలచిపోయింది. 1919 గృహల నిర్మాణం పునాదుల్లోనే ఉంది.


నిరుపేదలు సొంత ఖర్చులతో పునాదులు వేసుకొన్నారు. ఆ తరువాత బిల్లులు మంజూరు కాకపోవడంతో అలాగే మిగిలిపోయాయి. కొంతమంది అష్టకష్టాలు పడి కొంతమేరకు నిర్మాణాలు చేసినప్పటికీ వారికి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు మధ్యలో నిలచిపోయాయి. ఉన్న గూడు పడేసి సొంత ఇంటి కల నిజం చేసుకునేందుకు పేదలు పడిన కష్టం వృథా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుత పాలకులు గతంలో మంజూరైన గృహలకు బిల్లులు చెల్లింపుల గురించి పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై గృహ నిర్మాణశాఖ అధికారులను వివరణ కోరగా పెండింగ్‌ బిల్లులు ఇంకా విడుదల కాలేదన్నారు.

Updated Date - 2020-09-25T11:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising