ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.కోటి వ్యయం - లక్ష్యం శూన్యం

ABN, First Publish Date - 2020-09-25T11:22:44+05:30

అధికారుల నిర్లక్ష్యంతో 1200ల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ముసి ఆయకట్టు ఇప్పుడు నిరుపయోగంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1200 ఎకరాల సాగు లక్ష్యం 

 వంద ఎకరాలకు మాత్రమే సాగునీరు   

   

పొదిలి రూరల్‌, సెప్టెంబరు 24:

అధికారుల నిర్లక్ష్యంతో 1200ల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ముసి ఆయకట్టు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. పూడిక ఏర్పడడంతో సాగు ప్రశ్నార్థకమైంది. ఈ ఆయకట్టు పరిధిలో మరమ్మతుల కోసం రెండు సంవత్సరాల క్రితం సుమారు రూ.25 లక్షలతో టెండర్లు కూడా పిలిచారు.


అప్పుడు రైతులు ముమ్మరంగా మెట్టపైర్లు వేసే సమయం కావడంతో పనులు జరగక మధ్యలో నిలిచిపోయాయి. ఇక ఇప్పటి వరకు ఆయకట్టు మరమ్మతులు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మండలంలోని తళమల్ల, ఉప్పలపాడు, గోగినేనివారిపాలెం, ఏలూరు, సల్లూరు, నల్లారెడ్డిపాలెం గ్రామాల్లో మొత్తం 1200ల ఎకరాలకు సాగునీరు ఉంది. 


మండలంలోని తళమల్ల గ్రామానికి ఉత్తరాన దాదాపు 20 సంవత్సరాల క్రితం నాబార్డు నిధులతో తళమల్ల గ్రామ సరిహద్దులో ఈ ఆయకట్టు పరిధిలోని భూమి ఉంది. అ ప్పట్లో 13 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ ఏర్పాటుచేసి 6 గ్రామాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలనే ఉద్ధేశ్యంతో ఏర్పాటుచేశారు.


అయితే, పూర్తిస్థాయిలో కాలువ ప నులు చేపట్టకపోవడంతో పథకం ఉద్దేశ్యం నీరుగారి పో యిందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం 100 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తు తం కాలువలు మరమ్మత్తులు చేసి పూడికతీస్తే విద్యుత్తు అవసరం లేకుండా ఆయిల్‌ ఇంజన్లతో పొలం సాగుచేసుకోవచ్చని రైతులు అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2020-09-25T11:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising