ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీకి కొత్త మార్గదర్శకాలు

ABN, First Publish Date - 2020-12-20T06:54:22+05:30

ఉపాధ్యాయుల బదిలీలకు సంబం ధించి ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈనెల 31 వరకు ప్రభుత్వం గడు వు పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు విద్య, డిసెంబరు 19 : ఉపాధ్యాయుల బదిలీలకు సంబం ధించి ఆప్షన్లు నమోదు చేసేందుకు ఈనెల 31 వరకు  ప్రభుత్వం గడు వు పొడిగించింది. అలాగే ఆప్షన్లు నమోదు చేసుకొనేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. ఉపా ధ్యాయులు కేవలం మండల విద్యా వనరుల కేంద్రాల్లోనే ఆప్షన్ల నమో దును చేపట్టాలి. ఎంఈవో లాగిన్‌లో మాత్రమే అందుకు అవకాశం క ల్పించారు. ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసేటప్పుడు, మార్పు చేసేటప్పుడు వారి రిజిస్టర్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కోసం తప్పనిసరిగా ఉపాధ్యాయులు తమ రిజిస్టర్‌ మొబైల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. 

 ఎంఈవోలు రోజుకు పదిమంది టీచర్లను మాత్రమే వెబ్‌ఆప్షన్ల నమోదుకు అనుమతించాలి. 

 ఎంఆర్‌సీలకు ఆప్షన్లు పెట్టుకునేందుకు హాజరైన ఉపాధ్యాయులకు ఆ రోజుకు ఓడీ ఇస్తారు.. 

 ఎంఈవోలు కచ్చితంగా తమకు కేటాయించిన లాగిన్‌ పాస్‌వర్డ్‌లను ఎంఆర్‌సీ సిబ్బందికి మాత్రమే తెలియజేయాలి. 

ఆప్షన్ల నమోదు మార్పు, చేర్పులు ఎంఆర్‌సీలోనే జరగాలి.  

ఉపవిద్యాధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులందరికీ ఈ విషయం తెలియజేసి కొత్తగా వెబ్‌ఆప్షన్ల నమోదుకు, మార్పు లుచేర్పులకు ఎంఈవో కార్యాలయాలకు పంపించి ఆప్షన్ల ప్రక్రియ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

ఉపాధ్యాయుల ఆప్షన్ల నమోదు, మార్పులు, చేర్పులకు సమర్థులైన ఉపాధ్యాయులను లేదా సీఆర్‌పీలను ఎంఆర్‌సీల్లో వినియోగించు కోవచ్చు. ఎంఆర్‌సీల్లో ఆప్షన్ల నమోదు పనికి హాజరైన వారికి ఓడీ సౌకర్యం కల్పించారు. 

ఎంఆర్‌సీల్లో ఉపాధ్యాయులు సమర్పించిన వెబ్‌ఆప్షన్ల ప్రింట్లను పుస్తకరూపంలో తయారుచేసి డీఈఓ కార్యాలయానికి పంపాలి. 

ఈ కార్యక్రమం మొత్తం ఈనెల 31లోపు తగు జాగ్రత్తలతో పూర్తిచేసి బదిలీల ప్రక్రియలో డీఈవోకు సహకరించాలి. 

ఆప్షన్ల నమోదు వలన అమ్మఒడికి ఎటువంటి అంతరాయం కలగ కూడదని పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆదేశించారు. 


Updated Date - 2020-12-20T06:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising