ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఆంక్షల ముసుగులో నాటుసారా తయారీ

ABN, First Publish Date - 2020-03-27T10:31:09+05:30

కరోనా ఆంక్షల ముసుగులో కొందరు నాటుసారా తయారు చేసేందుకు స్థానిక రామ్‌నగర్‌ ప్రాంతంలో కొన్ని దారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాచారం అందడంతో చీరాల పోలీసులు దాడి

ఇద్దరు నిందితులపై కేసు.. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం


చీరాల, మార్చి 26 : కరోనా ఆంక్షల ముసుగులో కొందరు నాటుసారా తయారు చేసేందుకు స్థానిక రామ్‌నగర్‌ ప్రాంతంలో కొన్ని దారులను ముళ్లకంచెలతో మూసివేశారు. గుట్టుచప్పుడు కాకుండా నాటుసారాను తయారు చేస్తున్నారు. దీనిపై గురువారం టూటౌన్‌ సీఐ ఫిరోజ్‌కుౖ సమాచారం అందింది. వెంటనే ఆయన తన సిబ్బందితో కలసి ఆకస్మికంగా దాడిచేశారు. ఈ క్రమంలో నాటుసారా తయారీదారులకు దేహశుద్ధి చేశారు. వారి నుంచి 10 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఎవరైనా నాటు తయారీ, విక్రయాలకు పాల్పడితే వెంటనే సమచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుస్తామని సీఐ చెప్పారు.


20 లీటర్ల నాటుసారా స్వాధీనం

కొమరోలు మండలం చింతలపల్లిలో ఓ వ్యక్తి వద్ద ఇరవై లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేయగా మరొకరు పరారయ్యారని ఎక్సైజ్‌ సీఐ సోమయ్య చెప్పారు. అందిన సమాచారం మేరకు చింతలపల్లికి చెందిన కె.కొండయ్యను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి నాటుసారాను యర్రగుంట్లకు చెందిన కె.రామగోపాల్‌ సరఫరా చేసినట్లు తెలుసుకుని పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రామగోపాల్‌ పరారయ్యాడు. అతనిపైనా కేసు నమోదు చేసినట్లు సీఐ సోమయ్య చెప్పారు.


Updated Date - 2020-03-27T10:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising