నాడు-నేడు పనులను పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2020-12-16T05:23:01+05:30
పాఠశాలల్లో నాడు-నేడు పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని డీఈవో వి.ఎస్. సుబ్బారావు ఆదేశించారు.
డీఈవో సుబ్బారావు
మార్కాపురం (వన్‌టౌన్), డిసెంబరు 15 : పాఠశాలల్లో నాడు-నేడు పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని డీఈవో వి.ఎస్. సుబ్బారావు ఆదేశించారు. స్థానిక జడ్పీ బాలుర హైస్కూల్‌లో మార్కాపురం డివిజన్ లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానో పాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, ఉపాధ్యాయులు, విద్యాసహాయకులు సమన్వ యంతో పాఠశాలల అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొం దించుకొని ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కరోనా పట్ల అన్ని జాగ్రత్తలూ పాటించాలన్నారు. ఉప విద్యా శాఖాధికారి షేక్ సంధాని బాషా అధ్యక్షతన జరిగిన ఈ సమా వేశంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి కె.శివకుమార్, మార్కాపురం ఎం ఈవో రాందాస్ నాయక్, ప్రధానో పాధ్యాయుల సంఘం బాధ్యుడు వై.ఏసోబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T05:23:01+05:30 IST