ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి మాఫియా

ABN, First Publish Date - 2020-08-14T11:11:47+05:30

గిద్దలూరు మండలంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. కొండలను పిండిచేసి గ్రావెల్‌ను అక్రమంగా అమ్ముకుంటున్నప్పటికీ అధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండలను పిండి చేస్తున్నా 

పట్టించుకోని అధికారులు

యథేచ్ఛగా గ్రావెల్‌ అక్రమ అమ్మకాలు


గిద్దలూరు, ఆగస్టు 13 : గిద్దలూరు మండలంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. కొండలను పిండిచేసి గ్రావెల్‌ను అక్రమంగా అమ్ముకుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. గిద్దలూరు, నరవ తదితర ప్రాంతాలలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొండలను మట్టి మాఫి యా ప్రతినిధులు  ఎక్స్‌కవేటర్‌ సహాయంతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు.


గతంలో గిద్దలూరు సమీపంలోని దుప్పులతిప్పలో అధికారికంగా తవ్వుకునేందుకు కొంతమందికి లైసెన్స్‌ ఇచ్చారు. దాంతో ఎక్కువ మం ది కొండ ప్రాంతంలో ఇష్టానుసారంగా గ్రావెల్‌ను తవ్వుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లతో పాటు ఇళ్లు, ఇతర నిర్మాణాల సందర్భంగా గ్రావెల్‌ను ఉపయోగిస్తుండగా మాఫియా బరితెగించి ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించకుండా ఇష్టానుసారంగా తవ్వుకుంటున్నారు. దానికితోడు ఒక ప్రాంతంలో చదునుగా కాకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలుగా తీస్తుండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.


అధికారులు ఫిర్యాదులు చేసిన సందర్భాలలో మాత్రమే ఒకటి, రెండు ట్రాక్టర్ల మీద కేసులు పెట్టి  జరిమానా వేసి వదిలి వేస్తున్నారే తప్ప మట్టి తవ్వకాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తుంటే సంబంధిత అధికారులకు కూడా గ్రావెల్‌ అక్రమ తోలకం దా రులు అంతో, ఇం తో ముట్టచెప్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-08-14T11:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising