ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరిన్ని సడలింపులు

ABN, First Publish Date - 2020-05-29T10:24:06+05:30

జిల్లాలో 65 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన అనంతరం సడలింపులను అధికారులు గురువారం మరింతగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, మే 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 65 రోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన అనంతరం సడలింపులను అధికారులు గురువారం మరింతగా ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో   దుకాణాలు తెరుచుకున్నాయి. చాలారోజుల తర్వాత జిల్లా అంతటా జనసంచారం, వాహనాల రాకపోకలు కనిపించి సందడి వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఒంగోలులో ఉదయం నుంచి రద్దీ వాతావరణం కనిపించింది. తొలి కరోనా పాజిటివ్‌ కేసు ఒంగోలులో దాదాపు 70రోజుల క్రితం రాగా అప్పటి నుంచి నగరంలో ఆంక్షలు ప్రారంభమయ్యాయి. జనజీవనం ఒకరకంగా స్తంభించినంత పనైంది. చీరాల, కందుకూరు, కనిగిరి, చీమకుర్తి, మార్కాపురంతో పాటు మరికొన్ని ఇతర మండలకేంద్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.


నాల్గవదశ లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వెసులుబాటులు ఇస్తూ వస్తున్న అధికారులు గురువారం నాటికి వాటిని మరింతగా పెం చారు. ఒంగోలులో రెండు కాలనీలు మినహా మిగతా మొత్తాన్ని నాన్‌కంటైన్మెంట్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో అత్యధిక ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. కొన్నిచోట్ల పూజలు చేసి మరీ దుకాణదారులు వాటిని తెరవడం కనిపించింది. బట్టలు, నగలు, చెప్పులు వంటివాటితో పాటు ప్యాన్సీషాపులు, సెలూన్లు, టైలరింగ్‌ ఇతరత్రా పలురకాల దుకాణాలన్ని కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకు, మరికొన్నిచోట్ల సాయంత్రం వరకు పనిచేశాయి. శుక్రవారం నుంచి మరికొంత సడలింపులు పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2020-05-29T10:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising