మద్యానికి మోదం
ABN, First Publish Date - 2020-05-09T09:10:55+05:30
జిల్లాలో లాక్‌డౌన్ అమలులో విచిత్ర పరిస్థితి నెలకొంది. నాన్‌కంటైన్మెంట్ జోన్లలో మద్యం విక్రయాలను
నాన్‌కంటైన్మెంట్ జోన్లలో రాత్రి 7 గంటల వరకూ విక్రయం
ఇతర దుకాణాలకు మధ్యాహ్నం వరకే అనుమతి
జిల్లాలో విచిత్ర పరిస్థితి జూ 47వరోజూ కొనసాగిన లాక్‌డౌన్
ఒంగోలు, మే 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో లాక్‌డౌన్ అమలులో విచిత్ర పరిస్థితి నెలకొంది. నాన్‌కంటైన్మెంట్ జోన్లలో మద్యం విక్రయాలను రాత్రి వరకూ నిర్వహిస్తున్న యంత్రాంగం ప్రజ లందరికీ అవసరమైన నిత్యావసరాలు, ఇతర దుకాణలను మాత్రం మధ్యాహ్నానికే మూసివేయి స్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో ఉదయం 7నుంచి రాత్రి 7 వరకూ పలు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించు కోవచ్చు. మరికొన్నింటిని అధికారుల అనుమతితో షరతులకు లోబడి చేసుకోవచ్చు. అదే కంటై న్మెంట్ జోన్లలో అయితే ఎప్పటిలాగా ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే సడలిం పులు ఉంటాయి. ఆప్రకారం జిల్లాలో అమలుకు కలెక్టర్ అన్ని శాఖల అధి కారులకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రకారం ఈనెల 4నుంచి సడలింపు లు ఇవ్వాల్సి ఉండగా అమలు తొలి రెండురోజులు అమలు కాలే దు. తర్వాత నుంచి నాన్‌కంటైన్మెంట్ జోన్లలో మధ్యాహ్నం 1గంట వరకు మాత్రమే సడలింపులు వర్తింపజేస్తూ వస్తున్నారు. శుక్ర వారం కూడా అదేవిధానాన్ని అనుసరించారు.
జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం మద్యం దుకాణాలను తెరిచారు. పశ్చిమప్రాంతంలోని నాన్‌కంటైన్మెంట్ జోన్లలో ఉద యం 11 నుంచి రాత్రి 7వరకూ విక్రయాలు కొనసాగించారు. ప్ర జలందరికీ అవసరమైన దుకాణాలను మధ్యాహ్నానికే మూసివేయిం చి మద్యం షాపులను మాత్రం రాత్రి 7 వరకూ అనుమతించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కంటైన్మెంట్ జోన్లలో ఎప్పటిలాగే ఉదయం 9గంటల వరకూ సడలింపులు ఇస్తున్నారు. ఆ సమయంలో యంత్రాంగం కాస్తంత చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. దీంతో శుక్రవారం పలు కంటైన్మెం ట్ జోన్లలో జనసంచారం, వాహనాలరద్దీ పెరిగింది. కాగా 47వ రోజె ౖన శుక్రవారం కూడా అత్యధికశాతం మంది ప్రజానీకం స్వీయ నియం త్రణతో లాక్‌డౌన్‌ను పాటించారు.
Updated Date - 2020-05-09T09:10:55+05:30 IST