ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-11-30T04:14:59+05:30

నివర్‌ తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నా రాంబా బు అన్నారు.

నీట మునిగిన పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే అన్నా రాంబాబు

వర్షాలకు దెబ్బత్ని పంటల పరిశీలన


బేస్తవారపేట, నవంబరు 29: నివర్‌ తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే అన్నా రాంబా బు అన్నారు. ఆదివారం మండలంలోని కోనపల్లె, శింగరపల్లె, శింగసాని పల్లె, గలిజేరుగుళ్ల, పిటికాయగుళ్ల గ్రామాలను సందర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న కంది, మిరప, మొక్కజొన్న, రాగుల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మండలంలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. రైతులను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. నష్టపోయిన పంటల వివరాలను అధికారులు వెంటనే నమోదు చేయాలన్నారు. కోనపల్లె చెరువుకు నీరు రావడంతో ఎమ్మెల్యే జలహారతి ఇచ్చారు. పిటికాయగుళ్ళ చెరువు అలుగును పరిశీలించి,  గ్రామంలోకి నీరు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డి.బాలాజినాయక్‌, వ్యవసాయాధికారి జె.మెర్సీ, ఎంపీడీవో చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T04:14:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising