ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుల్లో స్వగ్రామాలకు వలస కూలీలు

ABN, First Publish Date - 2020-05-13T10:54:25+05:30

కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న వలస కూలీలను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురాంతకం, మే 12 : కరోనా నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న వలస కూలీలను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ చొరవతో మండల అధికారులు మంగళవారం తరలించారు. మండలంలో పనులకోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి 900మంది కూలీలు గత నవంబరులో వచ్చారు. అయితే ఈనెల 1, 2 తేదీలలో వాళ్ళందరూ తిరిగి వెళ్ళాల్సి ఉన్నా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెళ్ళలేకపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేష్‌ కలెక్టర్‌తో పాటు మార్కాపురం ఆర్డీవో, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుతో మాట్లాడి సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. ఎట్టకేలకు మంగళవారం ఉదయానికి అనుమతులు రావడంతో వైద్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం కూలీలను మార్కాపురం డిపో నుంచి వచ్చిన 40బస్సుల్లో తూర్పుగోదావరికి తరలించారు. తహసీల్దారు జి.జయపాల్‌, ఎస్సై యూవీ.కృష్ణయ్య, ఎంపీడీవో సుదర్శనం తరలింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

Updated Date - 2020-05-13T10:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising