ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవన ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలి

ABN, First Publish Date - 2020-10-20T07:57:21+05:30

వెనుకబడిన వర్గాలవారు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, అక్టోబరు 19: వెనుకబడిన వర్గాలవారు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన నేపఽథ్యంలో  బీసీ భవన్‌లో సోమవారం బీసీ సంఘాల నాయకులు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని సన్మానించారు. తొలుత గడియార స్తం భం వద్ద వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.


ఎమ్మెల్యే నాగార్జునరె డ్డి మాట్లాడుతూ మార్కాపురంలో బీసీ భవన్‌ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పిన్నిక లక్ష్మీ ప్రసాద్‌(పీఎల్‌పీ), చెం చయ్య, నల్లబోతుల కొండయ్య, ముంగమూరి పోల య్య, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షంషీర్‌ అలీబేగ్‌, వైసీ పీ పట్టణ అధ్యక్షుడు చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 


ఇళ్ల వద్దకే సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ ఇళ్ల వద్దకే సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మె ల్యే కుందురు నాగార్జునరెడ్డి సూచించారు. మండలంలోని బోడపాడు సచివాలయాన్ని సోమవారం సందర్శించారు. ఎంపీడీవో టి.హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు.

రైతు భరోసా కేంద్రాల ఏ ర్పాటు ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను రైతులకు చేరువ చేశామన్నారు.   ఈ సమావేశంలో ఏవో లక్ష్మీనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాగరాజు, వీఆర్వో నాగరాజకుమారి, వైసీపీ నాయకులు పోరెడ్డి చెంచిరెడ్డి, నల్లబోతుల కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. 

  


Updated Date - 2020-10-20T07:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising