ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌గా మద్యం అమ్మకాలు

ABN, First Publish Date - 2020-03-30T10:21:37+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్‌ చేసినా మండలంలో కరేడు, చాకిచర్ల, ఉలవపాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వార్టర్‌ బాటిల్‌ రూ.500 లెక్కన విక్రయం


ఉలవపాడు, మార్చి 29 : కరోనా వైరస్‌ నేపథ్యంలో మద్యం అమ్మకాలు బంద్‌ చేసినా మండలంలో కరేడు, చాకిచర్ల, ఉలవపాడు గ్రామాల్లో ప్రైవేట్‌గా అమ్ముతూనే ఉన్నారు. ఆత్మకూరు గ్రామానికి చెందిన యువకుడు తన కారులోనే గోనే సంచిలో పెట్టి క్వార్టర్‌ బాటిల్‌ రూ.500 లెక్కన ఉలవపాడులో అమ్మి సొమ్ము చేసుకున్నాడు. మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో మందుబాబులు ఎంతటికైనా అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. మండలంలోని ప్రభుత్వ మద్యం షాపుల్లో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్ల స్థానికులు కావడంతో బంద్‌కు ముందే చేతివాటం చూపించినట్లు సమాచారం.ఆన్‌లైన్‌లో మందు ఎక్కువ అమ్మినట్లు చూపిం చి కేసులు కేసుల మద్యం పక్కకు దాటేశారు.


ఈ వ్యవహారమంతా చాకిచర్లకు చెందిన గత మద్యం కాంట్రాక్టర్‌ కనుసన్నల్లో నడిచి ఉంటుందని ప్రచా రం ఉంది. రెండు రోజుల క్రితం సింగరాయకొండ ఎస్సై సీఐ తన సిబ్బందితో  చాకిచర్ల, కరేడు గ్రామాల్లో తనిఖీలు చేశారు. అంతేగాక ఎంపీటీసీ నామినేషన్ల సమయంలోనే ఉలవపాడుకు చెందిన కొందరు వైసీపీ నాయకులు, మద్యం షాపుల్లో పనిచేసే సూపర్‌వైజర్ల అండదండలతో ముందుజాగ్రత్తగా మద్యం కొనుగోలు చేసి ప్రస్తుత డిమాండ్‌ నేపథ్యంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-03-30T10:21:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising