ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలుదారులకు పరిహారం చెల్లింపునకు కృషి

ABN, First Publish Date - 2020-12-03T06:10:14+05:30

నివర్‌ తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు దేవదాయ, చు క్కల భూముల్లో పంట వేసి నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని జేసీ వెంకట మురళి అన్నారు.

పీసీపల్లిలో చుక్కల భూములను పరిశీలిస్తున్న జేసీ మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దేవదాయ భూములపై 

జేసీ వెంకట మురళి హామీ

కనిగిరి, డిసెంబరు 2 : నివర్‌ తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు దేవదాయ, చు క్కల భూముల్లో పంట వేసి నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని జేసీ వెంకట మురళి అన్నారు. మండల పరిధిలోని చల్లగిరగల గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను బుధవారం  జేసీ ఆకస్మి కం గా సందర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టపో యిన  రైతులు జేసీని కలసి తమ పరిస్థితిని, నష్టాన్ని తెలియజేశారు. తుఫాను కారణంగా పంట పొలంలో ఉన్న తడిచి, కుళ్లిపోయిన మినుము ఓదెలను రైతులు జేసీకి చూపించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ  ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త గిన న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించి పంట నష్టం వివ రాలను అడిగి తెలు సుకు న్నారు.  పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగేలా అంచనాలు తయారు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ రమణ, ఏవో రఫీక్‌ను ఆదేశించారు. సమా వేశంలో తహసీల్దార్‌ పుల్లారావు, వీఏహెచ్‌ నజ్మా, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.

భూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి 

పీసీపల్లి : త్వరలో ప్రభుత్వ భూములు రీసర్వే చేయనున్న దృష్ట్యా (ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌) భూమి రికా ర్డుల స్వచ్ఛీకరణ త్వరితగతిన పూర్తి చేయాలని  జేసీ మురళి తహసీ ల్దార్‌ సింగారావును ఆదేశించారు. మండలంలోని పెదఅల వలపాడు రెవెన్యూలో ఉన్న చుక్క ల భూము లను బుధవారం పరిశీలించారు. అ నంతరం పీసీపల్లి తహసీల్దార్‌ కా ర్యాలయంలో తహ సీల్దార్‌, డీటీ శ్రీనివాస్‌, సిబ్బందితో సమావేశం ని ర్వహించారు.  భూ సమస్యలు లే కుండా ఉండేందుకే ప్రభుత్వం భూముల రీ-సర్వే చేపట్టిం దని జేసీ అన్నారు. అ నం తరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ  భూముల రీ-సర్వే ద్వారా రికార్డుల్లోని తప్పులను సవరించి నిజ మైన హక్కుదారులకు భూమిపై హక్కు కలిగి ఉం డేలా వారి ఫొటోను ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడం జరుగుతుందన్నారు. ఈ రీ సర్వే సమయంలో పాత ఆర్‌ ఎస్‌ఆర్‌, వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ను ట్యాలీ చేయ డంతో పాటు వెబ్‌ల్యాండ్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ని వెబ్‌ ల్యాండ్‌ అడంగల్‌తో ట్యాలీ చేయడం ద్వారా రికార్డు ల్లోని తప్పులు గుర్తించడం జరుగు తుందన్నారు. వా టిని సరిచేసి భూమి హక్కు దారుల జాబితాను  సి ద్ధం చేస్తామని తెలిపారు. భూముల రీ-సర్వే ద్వారా మండ లంలోని 22 రెవెన్యూ గ్రామాల్లో 3 విడతలు గా  భూమి రికార్డుల స్వచ్ఛీకరణ చేయడం జరుగు తుం దని ఆయన తెలిపారు.

మాజీ సైనికుడి భూమిని పరిశీలించిన జేసీ 

కొనకనమిట్ల : మండలంలోని బచ్చలకురపాడులో మాజీ సైనికుడు నులకా చిన్న సుబ్బారెడ్డికి గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని బుధవారం జేసీ మురళి పరిశీలిం చారు. సర్వే నెంబరు 353-3లో 5.02 ఎకరాల భూమిని సుబ్బారెడ్డికి కేటాయించారు. దాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఆయన దర ఖాస్తు చేసుకోగా అందుకు సంబంధించిన రికార్డులను జేసీ చూశారు. ఈయన వెంట తహసీల్దార్‌ భాగ్య లక్ష్మి,  ఆర్‌ఐ ప్రకాశ్‌, సర్వేయర్‌ వెంకటేశ్వర్లు, వీఆర్‌ వో తదితరులు ఉన్నారు. 



Updated Date - 2020-12-03T06:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising