ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఇద్దరి బలి.. 15కు చేరిన శానిటైజర్‌ మృతులు

ABN, First Publish Date - 2020-08-02T15:46:42+05:30

కురిచేడులో శానిటైజర్‌ మృతులు పెరిగిపోతున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురిచేడు(ప్రకాశం): కురిచేడులో శానిటైజర్‌ మృతులు పెరిగిపోతున్నారు. శనివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 15కు చేరింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కూలి పనులు చేసుకుని జీవించే వారే శానిటైజర్‌ కాటుకు బలయ్యారు. పోలీసులు గ్రామంలో దండోరా వేసి ఎవరూ శానిటైజర్‌ సేవించవద్దని, దాన్ని ఇప్పటికే తాగి ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే పీహెచ్‌సీకి రావాలని సూచించారు. దీంతో పెద్ద ఎత్తున శానిటైజర్‌ బాధితులు వైద్యశాలకు వచ్చారు.


వారిలో ఇద్దరు శనివారం మృతి చెందారు. వారిలో కురిచేడు వాల్మీకి బజారుకు చెందిన కౌలూరి నరసయ్య (45), మీనిగ నాగేశ్వరరావు(55) ఉన్నారు. వీరిద్దరినీ కురిచేడు పీహెచ్‌సీలో చేర్చి చికిత్స చేయించగా పరిస్థితి విషమించింది. వెంటనే 108లో వినుకొండ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే నరసయ్య మృతి చెందగా నాగేశ్వరరావును వినుకొండలో చేర్చారు.


అక్కడ పరిస్థితి విషమంగా ఉందని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ సాయంత్రం 5గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచాడు. వినుకొండలో మృతిచెందిన నరసయ్య మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కురిచేడుకు తీసుకొచ్చి ఖననం చేశారు. గుంటూరులో మృతిచెందిన నాగేశ్వరరావు మృతదేహానికి పోస్టుమార్టం చేయాల్సి ఉంది. 


Updated Date - 2020-08-02T15:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising