ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుపై అక్కసుతో రాష్ట్రానికి అన్యాయం

ABN, First Publish Date - 2020-08-07T11:29:54+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసుతో వైసీపీ ప్రభుత్వం రాష్ర్టానికి అన్యాయం చేస్తోందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటమి భయంతోనే సవాల్‌ని అంగీకరించని జగన్‌

కొండపి ఎమ్మెల్యే స్వామి ధ్వజం


టంగుటూరు, ఆగస్టు 6: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్కసుతో వైసీపీ ప్రభుత్వం రాష్ర్టానికి అన్యాయం చేస్తోందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. గురువారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు సవాల్‌కు సమాధానం చెప్పలేక పోతున్నారన్నారు.  కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి టీడీపీ ప్రభుత్వంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని రైతుల నుంచి 33వేల ఎకరాల భూములు సేకరించారని ఎమ్మెల్యే స్వామి గుర్తు చేశారు. రాజధానిలో కావాల్సిన నిర్మాణాలు చేపట్టగా, జగన్‌ అధికారంలోకి రాగానే అవినీతి పేరుచెప్పి అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారని విమర్శించారు.


కులతత్వం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజధానిని మార్చాలని చూడడం జగన్‌ కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనమని ఆరోపంచారు. ప్రజా రాజధాని నిర్ణయించడానికి ప్రజల వద్దకు వెళ్లేందుకు భయమెందుకన్నారు. ప్రజలకు మీనిజ స్వరూపం తెలిసిపోయింది, తిరిస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు సవాల్‌కు పారిపోయారా? అని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగపరచకుండా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్వామి కోరారు.

Updated Date - 2020-08-07T11:29:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising